'ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది' - విజయవాడలో చంద్రబాబు పర్యటన తాజా వార్తలు
మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జగన్ ప్రభుత్వం జీవోలు తీసుకురావడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలానే మీడియాపై ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కథనాలు రాసేందుకు, ప్రసారం చేసేందుకు మీడియాకు స్వేచ్ఛ ఉందని, ఈ విషయంలో ప్రభుత్వంపై తెదేపా పోరాటం చేస్తుందని చంద్రబాబు తెలిపారు. తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
tdp
.