ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు - కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం

వైకాపా మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి... ప్రజలు కరోనా వైరస్‌తో సహజీవనం చేయాలని చెప్పడం సరికాదన్నారు. కరోనాపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వైకాపా వైఫల్యాల కారణంగానే క్రియాశీల కొవిడ్‌ కేసుల్లో... రాష్ట్రం 2 వ స్థానానికి ఎగబాకిందని చంద్రబాబు మండిపడ్డారు.

chandrababu-comments
chandrababu-comments

By

Published : Jul 29, 2020, 4:45 AM IST

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వారం రోజుల పాటు ' సమార భేరి' ఆందోళనలో చురుగ్గా పాల్గొన్న నాయకులను, కార్యకర్తలను ప్రశంసించారు. వైరస్‌ నివారణకు ప్రభుత్వం తమ శక్తులన్నింటినీ కేంద్రీకరించాల్సిన సమయంలో.. తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెడుతోందని మండిపడ్డారు. కేసుల ద్వారా వైకాపా నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారన్న చంద్రబాబు.. వీటిపై క్షేత్రస్థాయిలోనూ, న్యాయ పరంగానూ పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల రోజువారీ పెరుగుదల భయంకరంగా 14 శాతానికి పెరిగిందని.. మరణాల్లో 4 వ స్థానంలో నిలవటం ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టైనబుల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ద్వారా.. వైద్యులు, నిపుణులు, మేధావులతో క్రమం తప్పకుండా తెలుగుదేశం వెబ్‌నార్లను నిర్వహిస్తోందని వెల్లడించారు. వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా నివేదకలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నామన్నారు.

కొవిడ్‌ సమయంలో ప్రజలకు సహాయం చేసేందుకు టెలిమెడిసిన్‌ మంచి ఫలితాలను ఇచ్చేదన్న చంద్రబాబు.. ప్రభుత్వం దీనిని విస్మరిస్తోందని విమర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవటంలోనూ నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా చికిత్స పొందడానికి సామాన్య ప్రజలు చెప్పలేని కష్టాలను ఎదుర్కొంటుంటే.. అధికార పార్టీ నాయకులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పరీక్షల ఫలితాలు కూడా తప్పుగా ఉన్నాయన్న తెలుగుదేశం అధినేత.. డిశ్చార్జ్‌ అయిన రోగులకు 2వేల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 50-100 రూపాయలతో సరిపెడుతున్నారని విమర్శించారు. ఒక్కో వ్యక్తికి 3మాస్క్‌లు ఇస్తామన్న జగన్‌.. ఎంత మందికి అందించారో చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉండి తాము రెండున్నర లక్షల మాస్క్‌లు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రే... మాస్క్‌ పెట్టుకోకుండా తిరుగుతున్నారంటూ చంద్రబాబు తప్పుబట్టారు.

ఇదీ చదవండి:'ఐదో రోజూ 30 వేలకుపైగా కరోనా రికవరీలు'

ABOUT THE AUTHOR

...view details