ఉన్న నిర్మాణాలకు పార్టీ రంగులేసి ప్రభుత్వ ఖజానాకు సున్నం వేయడం తప్ప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏడాది కాలంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, ఉద్యోగాలు, రాష్ట్ర ప్రగతి, ప్రజల ఆదాయంలో పెరుగుదల, నిర్మాణాలు అంతా శూన్యమన్నారు. రాష్ట్రానికి పైసా ఉపయోగపడని 'జీరో సీఎం' పేరిట ఓ వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. వ్యవస్థలు, అభివృద్ధి అనేవి ఒకసారి గాడిన పడ్డాక కొత్తగా ఏమీ చేయకపోయినా.. అదే ఒరవడిని కొనసాగిస్తే చాలని...ప్రజలు ఫలాలను అందుకుంటూ ముందుకుపోతారని అభిప్రాయపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను చక్కదిద్ది, అభివృద్ధిని పరుగులు పెట్టించడం చేస్తే... వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఆ వ్యవస్థలన్నిటినీ గాడి తప్పించారని ధ్వజమెత్తారు. తమ స్వార్థం కోసం కావాలనే అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి, పోలవరం పనుల నిలిపివేతే ఇందుకు నిదర్శనమన్నారు.
'ఉన్న నిర్మాణాలకు పార్టీ రంగులు వేసి...ప్రభుత్వ ఖజానాకు సున్నం పెట్టారు' - chandrababu comments on cm jagan latest news
సీఎం జగన్ ఏడాది పాలనలో రాష్ట్రానికి పైసా ఉపయోగపడలేదని 'జీరో సీఎం' పేరిట చంద్రబాబు వీడియోను విడుదల చేశారు. తమ స్వార్థం కోసం కావాలనే అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు.
!['ఉన్న నిర్మాణాలకు పార్టీ రంగులు వేసి...ప్రభుత్వ ఖజానాకు సున్నం పెట్టారు' chandrababu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7476925-833-7476925-1591286287869.jpg)
chandrababu