హైదరాబాద్ నుంచి తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచే విధులు నిర్వర్తించనున్నారు. మహనాడు నిర్వహణకు సంబంధించిన కసరత్తు నివాసం వద్ద నుంచే చేపట్టనున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న విశాఖ పర్యటన పూర్తైతే ఇవాళంతా మహానాడు నిర్వహణపై కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28 తేదీల్లో అమరావతి నుంచే చంద్రబాబు మహానాడు కార్యక్రమాలకు హాజరవుతారు. ఎన్టీఆర్ భవన్ నుంచి మహానాడు సందేశం ఇవ్వనున్నారు. మహానాడు పూర్తి అయ్యాక చంద్రబాబు విశాఖ పర్యటన ఎప్పుడు అనేది ఖరారు కానుంది.
ఎన్టీఆర్ భవన్ నుంచే చంద్రబాబు మహానాడు సందేశం... - Chandrababu on lg polymers
హైదరాబాద్ నుంచి తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మహానాడు నిర్వహణ కసరత్తును చంద్రబాబు ఇంటి వద్ద నుంచే చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి మహానాడు సందేశం ఇవ్వనున్నారు.
ఉండవల్లిలో చంద్రబాబు