ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 20, 2020, 12:16 PM IST

ETV Bharat / state

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తెదేపా శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరిపారు. పేదలకు నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాల పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన పేదలకు కూరగాయలు, బియ్యం అందించారు.

chandrababu-birthday-celebrations
chandrababu-birthday-celebrations

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలోని చంద్రబాబునగర్‌లో పేదలకు మాజీ మంత్రి దేవినేని ఉమ... కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. విజయవాడ ఆర్టీసీ కాలనీ వద్ద 400 పేద కుటుంబాలకు మాజీ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ నిత్యావసరాలు అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు... తెలుగుదేశం శ్రేణులు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. తాడేపల్లి మండలం కొలనుకొండలో కేక్‌ కట్‌ చేసి... నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందజేశారు. మేడికొండూరులోని పేదలకు రూ.50 వేల విలువగల కూరగాయలను పేదలకు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details