Chandrababu angry on Illegal cases against Tdp leaders : పుంగనూరు-తంబళ్లపల్లె ఘటనల్లో తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అర్థ రహితంగా కేసులు పెడుతున్నారంటూ అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఏలూరులో చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. మారణాయుధాలతో వచ్చారని అనేక మంది నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారంటూ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అంగళ్లులో మారణాయుధాలతో దాడులకు యత్నించారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ డ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. డీజీపీకి చంద్రబాబు లేఖ
Punganur Issueఅంగళ్లు ఘటనలో 2 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా.. పుంగనూరు ఘటనలో ఐదు ఎఫ్ఐఆర్ లు.. 200 మందిపై కేసులు పెట్టారు. 60 మంది నేతలు ఇప్పటికే పోలీసుల అదుపులో వున్నారు. 24 గంటలకు పైగా పోలీసుల అదుపులో ఉన్నా కోర్టుకు హాజరు పర్చకపోవడంపై తెలుగుదేశం శ్రేణుల ఆందోళన వ్యక్తం చేశాయి. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 60 మంది నాయకుల ఆచూకీ చెప్పడం లేదని కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. వారిని గత రెండు రోజులుగా పోలీసులు చిత్ర హింసలకు గురిచేస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది.
ఏపీ పోలీసులు.. వైకాపా పాలనలో దిగజారిపోతున్నారు: చంద్రబాబు
Police encounter వైసీపీ ప్రభుత్వం చల్లా బాబురెడ్డిని ఎన్ కౌంటర్ చేయడానికైనా వెనుకాడరని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటన లో భయానక వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు, పోలీసులు కుట్రలు పన్నారని ఆరోపించారు. వజ్ర వాహనాలు, భాష్పవాయి గోళాలను సిద్ధం చేసుకున్నారన్నారు. పుంగనూరుటీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి కుటుంబ సభ్యులు ఏలూరులో చంద్రబాబు ని కలిశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని బాబురెడ్డి సోదరి, కుమార్తె చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ కేసులకు భయపడొద్దని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.