ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిటాల రవికి చంద్రబాబు, నారా లోకేష్ నివాళులు - పరిటాల రవికి చంద్రబాబు

దివంగత నేత పరిటాల రవి జయంతి సందర్భంగా... తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయనకు నివాళులర్పించారు. పరిటాల రవి పేదల పక్షాన నిలిచిన వ్యక్తని గుర్తుచేశారు.

chandrababu and nara lokesh pays tributes to paritala ravi on his birth anniversary
పరిటాల రవి జయంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్ నివాళులు

By

Published : Aug 30, 2020, 12:28 PM IST

తెలుగుదేశం నేతగా రాయలసీమ పునర్నిర్మాణంలో పరిటాల రవి కీలకపాత్ర పోషించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు ఆర్పించారు.

పరిటాల రవి జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళులు

ఫ్యాక్షనిజం పడగలో సామాన్యుల బతుకులు ఛిద్రమైపోతున్న వేళ...ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన వ్యక్తి పరిటాల రవీంద్ర. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన వ్యక్తి పరిటాల రవీంద్ర.

-చంద్రబాబు

దివంగత నేత పరిటాల రవి జయంతి సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయనకు నివాళులు అర్పించారు.

పరిటాల రవి జయంతి సందర్భంగా నారా లోకేష్ నివాళులు

'పరిటాల అనే ఇంటి పేరును పోరాటాలు'గా మార్చుకున్న కుటుంబంలో నుంచి వచ్చి పేదల పక్షాన నిలబడ్డారు. జీవితమంతా ఫ్యాక్షన్ శక్తులతో పోరాడి పేదల గుండె చప్పుడుగా నిలిచారు.

-నారా లోకేష్

ఇదీ చదవండి:

అచ్చెన్నను ఫోన్‌లో పరామర్శించిన నారా లోకేశ్

ABOUT THE AUTHOR

...view details