రైతు బంధు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడు, పోరాటాలకు మారు పేరు గౌతు లచ్చన్న అని కొనియాడారు. బ్రిటిష్ వారిపై తిరగబడ్డ సర్దార్ లచ్చన్న.. ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని, ఎన్జీ రంగా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై పాదయాత్ర చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల హక్కుల కోసం, జీవితాంతం రాజీలేని పోరాటం చేశారన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడ్డారని, తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన తోటపల్లి బ్యారేజీకి సర్దార్ గౌతు లచ్చన్న పేరుపెట్టి గౌరవించామని చంద్రబాబు అన్నారు. వల్లభాయి పటేల్ తర్వాత ప్రజల చేత సర్దార్ అని పిలిపించుకున్న నేత గౌతు లచ్చన్నేనని లోకేష్ అన్నారు. దేశం కోసం, బడుగు, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం లచ్చన్న చేసిన సాహోసోపేత పోరాటాలకు ఇది నిదర్శనమన్నారు.
గౌతు లచ్చన్నకి చంద్రబాబు,లోకేశ్ నివాళులు - గౌతు లచ్చన్నకి చంద్రబాబు,లోకేశ్ నివాళులు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు.. రైతు బంధు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌతు లచ్చన్నకు నివాళులర్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల హక్కుల కోసం గౌతు లచ్చన జీవితాంతం రాజీలేని పోరాటం చేశారన్నారు.
గౌతు లచ్చన్నకి చంద్రబాబు,లోకేశ్ నివాళులు
ఇవీ చదవండి