రెండోరోజు కృష్ణాజిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష - chandrababu review meeting in Vijayawada
కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితిపై.. నాయకులతో తెదేపా అధినేత చంద్రబాబు సమీక్ష.. రెండోరోజూ కొనసాగుతోంది.
కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండో రోజు సమీక్ష కొనసాగిస్తున్నారు. విజయవాడ 'A' కన్వెన్షన్ లో ఇవాల్టి సమావేశం. తొలుత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం రాజకీయ దాడుల బాధితులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారిపై నమోదైన కేసుల వివరాలను పరిశీలించనున్నారు. తర్వాత 5 నియోజకవర్గాల నేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అవనిగడ్డ, నందిగామ..... సాయంత్రం పామర్రు, నూజివీడు..... రాత్రికి గుడివాడ నియోజకవర్గాల సమీక్షలు చేయనున్నారు.
TAGGED:
విజయవాడలో చంద్రబాబు సమీక్ష