ప్రభుత్వ అసమర్థత కారణంగా కోవిడ్ పరీక్షా కేంద్రాలు వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన విజువల్స్ షాక్కు గురిచేసాయని ట్వీట్ చేశారు. రాజమహేంద్రవరంలో కరోనా పరీక్షల కోసం వందల మంది వేచి ఉన్నారని.. కనీసం సామాజిక దూరం లేదన్నారు. ప్రభుత్వం నుంచి సహాయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేర ట్విట్టర్లో ఓ వీడియో విడుదల చేశారు.
'వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా.. కోవిడ్ పరీక్షా కేంద్రాలు' - news on corona centres in ap
కరోనా పరీక్షా కేంద్రాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ పరీక్షా కేంద్రాలు.. వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని దుయ్యబట్టారు.
కరోనా పరీక్షా కేంద్రాలపై చంద్రబాబు