ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్యాయాలపై పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి' - chandra babu on gurram jashwa

గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడటమే.. ఆయనకు అందించే నిజమైన నివాళి అని చంద్రబాబు అన్నారు.

chandra babu, nara lokesh condolence to gurram jashuva
గుర్రం జాషువాకు చంద్రబాబు, నారా లోకేశ్ నివాళులు

By

Published : Jul 24, 2020, 5:34 PM IST

ప్రముఖ కవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. తన రచనాశక్తితో సామాజిక రుగ్మతలపై పోరాడి సమాజంలో చైతన్యాన్ని రగిలించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని చంద్రబాబు కీర్తించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడటమే.. ఆయనకు అందించే నిజమైన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు.

సమాజంలోని అసమానతలపై తన ఆవేదనను కవిత్వ మార్గంలో వెలిబుచ్చి, అదే కవిత్వంతో సమాజాన్ని చైతన్యవంతం చేసిన కవికోకిల గుర్రం జాషువ అని నారా లోకేశ్ కొనియాడారు. దళితాభ్యుదయాన్ని సాధించడంలో గుర్రం జాషువాగారి స్ఫూర్తిని నేటి సమాజం అందుకోవాలని లోకేశ్‌ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం

ABOUT THE AUTHOR

...view details