విజయవాడలోని ధర్నా చౌక్ లో డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన చేపట్టారు. డీఎస్సీ 2008 లో నష్టపోయిన తమ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో అంగీకార పత్రాలు తీసుకొని 7 నెలలు గడిచినా.. నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు.
చలో విజయవాడ, జగనన్న మీద అలక పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి 2193 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం తమ దస్త్రం ఆర్థిక శాఖా ముఖ్య కార్యదర్శి రావత్ వద్ద ఉందని చెప్పారు. వెంటనే తమకు జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.