తెదేపా ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల పునరావాస శిబిరానికి అగ్ర నేతలు తరలివచ్చారు. ఛలో ఆత్మకూరు సభ బుధవారం కచ్చితంగా జరుగుతుందని నేతలంతా తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు శిబిరం కొనసాగుతుందన్నారు. బాధితుల్ని హోం మంత్రి పెయిడ్ ఆర్టిస్టులని అవమానించారంటూ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పోలీసులే చూపాలని బాధితులు కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రతి బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా, ధ్వంసమైన ఆస్తులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
చలో ఆత్మకూరు.. సభ కచ్చితంగా జరుగుతుంది - గుంటూరులో తెదేపా నేతల సమావేశం
వైకాపా బాధితుల శిభిరానికి తెదేపా సీనియర్ నేతలందరు తరలివచ్చారు. ఛలో ఆత్మకూరు..సభ యధాతథంగా కొనసాగుతుందని తెలిపారు. ఉన్నతాధికార్లు వచ్చి హామీ ఇచ్చే వరకు శిభిరాన్ని కొనసాగిస్తామని నేతలు చెప్పారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.

ఛలో ఆత్మకూరు సభ
Last Updated : Sep 10, 2019, 9:13 PM IST