ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన తెలుగు మహాసభలు ఇవాళ్టితో ముగుస్తాయి. సదస్సులో రచయిత చలసాని శ్రీనివాస్ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. 8 రాష్ట్రాల్లో తెలుగు బడులున్నాయని ఆయన తెలిపారు. తెలుగును ఉపాధి భాషగా పరిగణించినప్పుడే బతుకుతుందని... తెలుగు రచయితలు ఉంటారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ మాతృభాషలోనే భోదిస్తున్నారని వివరించారు. స్థానిక ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధ్యాన్యం ఇవ్వాలని కోరారు.
'తెలుగును ఉపాధి భాషగా పరిగణించాలి'
విజయవాడలో జరుగుతున్న తెలుగు మహాసభలు నేటితో ముగియనున్నాయి. మహిళా ప్రతినిధులు, ప్రముఖ రచయితలు సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగు భాష ఉన్న పరిస్థితిని ప్రముఖ రచయిత చలసాని శ్రీనివాస్ వివరించారు.
తెలుగు మహాసభల్లో మాట్లాడుతున్న చలసాని శ్రీనివాస్
ఇదీ చూడండి