కృష్ణా జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో పట్టపగలే దొంగతనం జరిగింది. పనికిఆహారపథకం పని ముగించుకొని ముగ్గురు మహిళలు ఇంటికి వెళుతుండగా చైన్ స్నాచర్ల కాపు కాచుకుని కూర్చున్నారు. ఆ ముగ్గురు మహిళలలో ఒక మహిళ మెడలోని బంగారు మంగళ సూత్రాన్ని అపహరించి పోతుండగా వేముల మాధవరావు అనే వ్యక్తి గమనించారు. వారిని వెంటపడి మరీ పట్టుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని నిందితుల్ని అరెస్ట్ చేశారు.
చైన్ స్నాచర్ అరెస్ట్.. చోరీ చేసి పారిపోతుండగా పట్టిచ్చిన స్థానికుడు! - మంగళ సూత్రం చోరీ
తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో పట్టపగలే దొంగతనం జరిగింది. ఉపాధి హామీ పని ముగించుకుని వెళ్తున్న మహిళల మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని వెళుతుండగా అక్కడే ఉన్న మరో వ్యక్తి నిందితుల్ని పట్టుకున్నాడు.
దొంగతనం