ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గయ్యపేటలో చైన్​ స్నాచర్స్ అరెస్ట్ - Crime news in Jaggayyapeta, Krishna district

విద్యావంతులైన యువకులు దొంగతనాలకు పాల్పడుతూ.. పోలీసులకు చిక్కిన ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. చెడు వ్యసనాలకు బానిసలై... నేరస్థులుగా మారినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

జగ్గయ్యపేటలో చైన్​ స్నాచర్స్ అరెస్ట్
జగ్గయ్యపేటలో చైన్​ స్నాచర్స్ అరెస్ట్

By

Published : Apr 5, 2021, 4:52 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. వారిని చూసి ఇద్దరు యువకులు పరారవుతుండగా... పోలీసులు అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు చైన్ స్నాచర్లని గుర్తించారు. బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఆ ఇద్దరినీ జగ్గయ్యపేటకు చెందిన కోనేటి అనిల్ (32), ముద్రకోల నరసింహారావు (32)గా గుర్తించారు. వీరిద్ధరు విద్యావంతులని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలై నేరస్తులుగా మారారని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details