కృష్ణా జిల్లా నందిగామలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. రామన్నపేటలో లక్ష్మీప్రసన్న అనే యువతి మెడలో ఉన్న బంగారం గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చి లాక్కెళ్లారు. బంగారం మూడు కాసులు ఉంటుందని దీని విలుల 90 వేలుగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.