రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యవసాయ సలహాదారులు, మండల వ్యవసాయ, పశు విస్తరణ నిపుణులుగా ఉన్న తమను తొలగించటంపై సెర్ఫ్ మాజీ ఉద్యోగులు విజయవాడలో ఆందోళన వ్యక్తం చేశారు. 168 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఉత్పత్తులు పెంచటానికి సెర్ఫ్ ఎంతో ఉపయోగపడేదని...ప్రాజెక్ట్ ముగిసిందని ఉద్యోగులను తీసివేయడం సరికాదన్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతూ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, సెర్ఫ్ సీఈవో, పలువురు రాజకీయ నేతలకు వినతిపత్రాలు అందజేశారు.
తమను తొలగించడం అన్యాయమంటూ సెర్ఫ్ ఉద్యోగుల ఆందోళన
సెర్ఫ్ మాజీ ఉద్యోగస్ధులు విజయవాడలో ఆందోళన చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ముగిసిందని తమను విధుల నుంచి పక్కన పెట్టడం సరికాదని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ పంచాయితీ రాజ్ శాఖ మంత్రితోపాటుగా సెర్ఫ్ సీఈవో, పలువురు రాజకీయ నేతలకు వినతిపత్రాలు అందజేశారు.
సెర్ఫ్ ఉద్యోగుల ఆందోళన