విజయవాడ నగరంలోని పలు కంటయిన్మెంట్ జోన్‌లలో కేంద్ర బృందం ప్రతినిధులు పర్యటించారు. కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన కృష్ణలంక ప్రాంతంలో పర్యటించి వాలంటీర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులతో ముఖాముఖిగా మాట్లాడారు. క్వారంటైన్... స్వీయ క్వారంటైన్‌కు సంబంధించి వారికి ఉన్న అవగాహన గురించి అడిగి తెలుసుకున్నారు.
కరోనా గురించి ప్రజల్లో చైతన్యం నింపాలి - corona latest news vijayawada
విజయవాడ నగరంలోని పలు కంటయిన్మెంట్ జోన్‌లలో కేంద్ర బృందం ప్రతినిధులు పర్యటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కేంద్ర బృందం సభ్యులు డాక్టర్. వివేక్ అదిష్, డాక్టర్. రుచి గెలాంగ్ సూచించారు.
భయభ్రాంతులకు గురిచేయకుండా కరోనా వైరస్ వ్యాప్తిని ఏ విధంగా నివారించగలిగేలా ప్రజల్లో అవగాహన తేవాలని చెప్పారు. విజయవాడ నగరంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఒకటైన కృష్ణలంకను రెడ్‌జోన్‌గా ప్రకటించి... వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందకుండా తీసుకుంటోన్న చర్యల గురించి కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కేంద్ర బృందానికి వివరించారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లోని ప్రజలకు ఇంటి వద్దకు నిత్యావసరాలు అందించే చర్యలు తీసుకున్నామని.... ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని... పోలీసులు కవాతు నిర్వహించడంతోపాటు డ్రోన్ ద్వారా ప్రజల కదలికలపై నిఘా ఉంచుతున్నారని తెలిపారు. కంటయిన్మెంట్ జోన్‌లలో జ్వరం, దగ్గు, జలుబు వంటిలక్షణాలున్న ప్రజల వివరాలను ఇంటింటి సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నామని, వైఎస్సార్ టెలీమెడిసిన్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.