దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే...కార్మిక సంక్షేమానికి సంబంధించిన నిధులనుఉత్తరాది రాష్ట్రాలుసమగ్రంగా వాడుతున్నాయని జాతీయ కార్మిక సంక్షేమ సంస్థ ఛైర్మన్ జయప్రకాశ్ నారాయణ తెలిపారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమన్నారు. త్వరలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ రాష్ట్రంలో పర్యటిస్తారని వెల్లడించారు. ప్రజాసమస్యలు, కార్మిక సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల వివరాలను అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు.
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం: జయప్రకాశ్ నారాయణ - విజయవాడలో కార్మిక సంక్షేమ సంస్థ చైర్మన్
దేశంలో అభివృద్ధి భారతీయ జనతాపార్టీతోనే సాధ్యమవుతుందని జాతీయ కార్మిక సంక్షేమ సంస్థ ఛైర్మన్ జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... ప్రజాసమస్యలు , కార్మిక సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువచేస్తామన్నారు.
central-labour-welfare-board-chairmen
TAGGED:
కార్మిక సంక్షేమ పథకాలు