పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు నీట్ పరీక్షలో అర్హత కటాఫ్ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో పీజీ వైద్యవిద్యలో మూడు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తయింది. ఈ సమయంలో అర్హత కటాఫ్ మార్కులను తగ్గించటం వల్ల మిగిలిన సీట్లలో మరింత ఎక్కువమంది ప్రవేశాలకు అర్హత సాధిస్తారు. జనరల్ కేటగిరీలో అంతకు ముందు 50వ పర్సంటైల్ (366 మార్కులు )ఉండగా.. దాన్ని 30వ పర్సంటైల్(275 మార్కులు)కు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలో 40(319 మార్కులు) నుంచి 20వ పర్సంటైల్(230 మార్కులు)కి, దివ్యాంగుల కేటగిరీలో 45(342మార్కులు) నుంచి 25వ పర్సంటైల్ (252 మార్కులు)కు తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు.
పీజీ వైద్యవిద్య విద్యార్థులకు శుభవార్త.. కటాఫ్ మార్కులు రెండింతలు తగ్గింపు - cut off marks news in pg students
పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు నీట్ పరీక్షలో అర్హత కటాఫ్ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరిలో 50 పర్సంటైల్ ఉండగా తాజాగా ఈ నిర్ణయంతో 30 పర్సంటైల్కే అర్హత పొందే వీలుంది. ఇంకా ఎస్టీ ఎస్సీ, ఓబిసీ కేటగిరీలోనూ ప్రస్తుతం ఉన్న పర్సంటైల్‌కు రెండింతలు తగ్గించారు.
central govt take a decision about NEET Exams cut off markes decreases to all categories