పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పోలవరానికి పర్యావరణశాఖ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపైనా కేంద్రం వివరణ కోరినట్లు సమాచారం. పోలవరం, అనుబంధ ప్రాజెక్టులపై చెన్నై పర్యావరణశాఖ అధికారులతో తనిఖీలు జరిపించింది. తనిఖీల తర్వాత అధికారులు కేంద్రానికి నివేదిక అందజేశారు. పర్యావరణ అనుమతుల నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయని నివేదికలో అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఎన్‌జీటీలో చెన్నై పర్యావరణ అధికారులు అఫిడవిట్ వేశారు. ఈ ఉల్లంఘనలపై ఏపీకి నోటీసులు జారీచేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పోలవరానికి ఇటీవలే స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను కేంద్రం రెండేళ్లపాటు గతంలో పొడిగించింది. మళ్లీ అనూహ్యంగా షోకాజ్ నోటీసులు జారీచేసింది.
పోలవరంపై కేంద్రం సీరియస్... అనుమతులు రద్దు చేయమంటారా?
పోలవరం నిర్మాణంపై రాష్ట్రానికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీచేసింది. అనుమతి ఎందుకు రద్దు చేయకూడదని పర్యావరణ శాఖ ప్రశ్నించింది.
పోలవరంపై రాష్ట్రానికి కేంద్రం షోకాజ్ నోటీసు
ఇదీ చదవండి :ప్రపంచమంతా కరెంట్ కష్టాలు ఖాయం!