Padma Awards - 2022: కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు పరిశ్రమలు, వాణిజ్యం విభాగంలో పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేశారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు కొవిషీల్డ్ టీకా తయారు చేసిన సీరమ్ సంస్థ వ్యవస్థాపకులు సైరస్ పూనావాల, టెక్ దిగ్గజ సంస్థలైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు.
Padma Awards - 2022: డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులకు పద్మ భూషణ్
20:07 January 25
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
2021 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్, 17మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక..
- గరికపాటి నరసింహారావు (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
- గోసవీడు షేక్ హసన్ (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
- డా.సుంకర వెంకటఆదినారాయణ (ఏపీ)కు పద్మశ్రీ అవార్డు
- దర్శనం మొగిలయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
- రామచంద్రయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
- పద్మజా రెడ్డి (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
ఇదీ చూడండి