కేంద్రాన్ని విమర్శించే తీరులో చేస్తున్న వ్యాఖ్యలు.. తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాయికి తగిన భాష కాదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. తాము తప్ప ఏ పార్టీ ఉండకూడదనే సంకుచిత ధోరణిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆగ్రహించారు. పురపాలికలు, గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
గ్రామ సర్పంచ్‌లు బిచ్చగాళ్లా... సీఎం కేసీఆర్ చెప్పాలని కిషన్రెడ్డి నిలదీశారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే.. రైతు బంధు వర్తించదని చెప్పడం రైతుల నెత్తిపై కత్తి పెట్టినట్లు కాదా? అని మండిపడ్డారు. రాష్ట్రాలు, దేశ భవిష్యత్తు బాగుండాలనే కేంద్రం సంస్కరణలు అమలు చేస్తోందని చెప్పారు. టీమ్ ఇండియాగా కలిసి పనిచేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.