ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ జెండాకు వందేళ్లు.. విజయవాడలో స్వచ్ఛంద సంస్థ ర్యాలీ - Indian National Flag Latest News

వందేళ్ల కిందట స్వాతంత్ర పోరాట యోధుడు మహాత్మా గాంధీ విజయవాడ పర్యటనలో భాగంగా.. భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1921 మార్చి 31న జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య సాక్షిగా భారత త్రివర్ణ పతాకాన్ని మొదటిసారిగా ప్రజల ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆనాటి జ్జాపకాలతో అవగాహన ర్యాలీని ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది.

వందేళ్లు పూర్తి చేసుకున్న జాతీయ జెండా యాదిలో అవగాహన ర్యాలీ
వందేళ్లు పూర్తి చేసుకున్న జాతీయ జెండా యాదిలో అవగాహన ర్యాలీ

By

Published : Mar 31, 2021, 5:02 PM IST

జాతీయ పతకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తైన సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ అవగాహన ర్యాలీని విజయవాడలో నిర్వహించారు. సరిగ్గా వందేళ్ల క్రితం 1921 మార్చి 31న విజయవాడలో బాపు మ్యూజియం వద్ద గాంధీజీ పింగళి వెంకయ్యను పిలిపించి స్వాతంత్ర సమరయోధుల ముందు జాతీయ పతాకాన్ని ఖరారు చేశారు.

త్రివర్ణ పతాకం ఆవిష్కరణ..

మరుసటి రోజు 1921 ఏప్రిల్ 1న విజయవాడ జింఖానా మైదానంలో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ శత వసంత సందర్భాన్ని పురస్కరించుకుని బాపు మ్యూజియం నుంచి జింఖానా మైదానం వరకు ప్రజాపతి నేషనల్ ఆంథమ్, నేషనల్ ఫ్లాగ్ ట్రస్ట్ అండ్ సొసైటీ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య విగ్రహం నుంచి అవగాహన ర్యాలీని చేపట్టారు.

ఇవీ చూడండి:

మువ్వన్నెలు విరిసిన వేళ..శత వసంతాల హేల.. !

ABOUT THE AUTHOR

...view details