కృష్ణా జిల్లా గన్నవరంలో శతాధిక వృద్ధుడు మృతి చెందారు. విశ్రాంత ఆయుర్వేద వైద్యుడు వేలూరి ఉమామహేశ్వరశాస్త్రి (114) మరణించారు. ఆయన వయోభారంతో చనిపోయినట్లు కుటుంబసభ్యుల వెల్లడించారు.
ఉమామహేశ్వరశాస్త్రి శ్రీశైలంలో ఆయుర్వేద వైద్యాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ వైద్యునికి సంస్కృత పండితుడిగా మంచి గుర్తింపు కూడా ఉంది.