కృష్ణాజిల్లా చాట్రాయి మండలం నరసింహారావు పాలెం వద్ద సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ పంట పొలాల్లో బోల్తా పడింది. విసన్నపేట - సత్తుపల్లి రాష్ట్రీయ రహదారి అభివృద్ది పనులు చేస్తున్నందున వాహనాలను నరసింహారావు పాలెం వైపు దారి మళ్ళించారు. సింగిల్ రహదారి కావడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ పంటపొలాల్లో బోల్తాపడింది. వరి పొలంలో సిమెంటు పడటంతో పంట నష్టం వాటిల్లింది. పక్కనే ఉన్న వ్యవసాయ కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. డ్రైవర్, క్లీనర్ బయటకు దూకేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
పంట పొలాల్లో సిమెంట్ లారీ బోల్తా - కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాద వార్తలు
పంటపొలాల్లో సిమెంట్ లారీ బోల్తా పడిన ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం నరసింహారావు పాలెం వద్ద చోటుచేసుకుంది.
![పంట పొలాల్లో సిమెంట్ లారీ బోల్తా cement-lorry-overturns-in-crop-fields-in-krishna-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8559006-591-8559006-1598415623113.jpg)
పంట పొలాల్లో సిమెంట్ లారీ బోల్తా