...
'రాష్ట్ర కొవిడ్ సెంటర్కు.. అన్ని ఆసుపత్రుల సీసీ కెమెరాలు అనుసంధానం' - రాష్ట్ర కోవిడ్ సెంటర్ తాజా వార్తలు
కొవిడ్ ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రుల్లోని సీసీ కెమెరాలను రాష్ట్ర కొవిడ్ సెంటర్కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్యం, పరిసరాల శుభ్రత పై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. రాష్ట్ర కొవిడ్ సెంటర్ నుంచి నిత్యం వైద్య నిపుణులు పర్యవేక్షిస్తుండడం వల్ల మరణాల రేటు తగ్గే అవకాశం ఉందని చెపుతున్నారు. చికిత్స అందిస్తున్న వార్డుల్లో లోపాలుంటే వెంటనే సంబంధిత ఆసుపత్రి నోడల్ అధికారికి తెలిపి సమస్యలు పరిష్కరిస్తామని చెపుతున్న స్టేట్ కోవిడ్ కంట్రోల్ రూం ప్రత్యేక అధికారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి ..
రాష్ట్ర కోవిడ్ సెంటర్కు అన్ని ఆసుపత్రుల సీసీ కెమెరాలు అనుసంధానం