ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీసీ కెమెరా మానిటరింగ్ వ్యవస్థ ప్రారంభించిన మంత్రి - సీసీ కెమెరా మోనిటరింగ్ వ్యవస్థ ప్రారంభించిన మంత్రి

కృష్ణా జిల్లాలో నేరనివారణకు కృషి చేస్తున్న పోలీసులను మంత్రి కొడాలి నాని అభినందించారు. గుడివాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా మానిటరింగ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు.

సీసీ కెమెరా మోనిటరింగ్ వ్యవస్థ ప్రారంభించిన మంత్రి
సీసీ కెమెరా మోనిటరింగ్ వ్యవస్థ ప్రారంభించిన మంత్రి

By

Published : Jun 22, 2020, 4:00 PM IST

కృష్ణాజిల్లా గుడివాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా మానిటరింగ్ వ్యవస్థను మంత్రి కొడాలి ప్రారంభించారు. దాతల సహకారంతో పోలీస్ స్టేషన్​లో అదనపు గదులు నిర్మాణం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను సన్మానించారు.

జిల్లాలో నేరనివారణతోపాటు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్న పోలీసులను మంత్రి కొడాలి నాని అభినందించారు. ప్రజా రక్షణలో పోలీసుల పాత్ర మరువలేనిదని ఆయన వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details