ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం గారూ.. 4 నెలలుగా ఏం జరుగుతోంది?: చంద్రబాబు

By

Published : Oct 1, 2019, 12:13 PM IST

ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డికి... తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధి హామీ పనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదన్నారు.

ముఖ్యమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు

ముఖ్యమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు

ఉపాధి హామీ పనుల్లో 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు.. తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు చంద్రబాబు లేఖ రాశారు. కూలీలకు సకాలంలో వేతనాలు, గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహించారు. కూలీల ఉపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉపాధి హమీ పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. పనులు చేసినవారికి బిల్లులు ఇవ్వట్లేదు.. కూలీలకు సకాలంలో వేతనాలు లేవు. ఉపాధి హామీ కౌన్సిల్‌ సభ్యులు రాష్ట్ర మంత్రి, అధికారులను కలిసినా ఫలితం లేదు. గత 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్యర్యానికి గురిచేస్తున్నాయి. రద్దులు, కూల్చివేతలు, నిలిపివేతలతో ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికైనా తక్షణమే స్పందించి సత్వరమే నిధులు విడుదల చేయాలి . పెండింగ్‌ బిల్లులు ప్రాధాన్యతక్రమంలో చెల్లించాలి. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి.

- చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి

కర్తార్​పుర్'​ ప్రారంభోత్సవానికి మన్మోహన్​కు ఆహ్వానం!

ABOUT THE AUTHOR

...view details