ప్రధాని పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... స్థానిక ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై పోరాడాలని సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలపై సాక్ష్యాధారాలు సేకరించాలని నేతలకు పిలుపునిచ్చారు. వాటన్నింటినీ ఆర్వోలు, ఈసీకి పంపించాలని ఆదేశించారు. వైకాపా దౌర్జన్యాలపై కోర్టుల్లో కేసులు వేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌కే భద్రత లేకుంటే... సామాన్యుల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.
స్థానికపోరులో వైకాపా దౌర్జన్యాలపై తెదేపా కేసులు..! - స్థానికపోరులో వైకాపా దౌర్జన్యాలపై తెదేపా కేసులు
స్థానిక ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలపై సాక్ష్యాధారాలు సేకరించాలని నేతలకు పిలుపునిచ్చారు. వాటన్నింటినీ ఆర్వోలు, ఈసీకి పంపించాలని ఆదేశించారు. వైకాపా దౌర్జన్యాలపై కోర్టుల్లో కేసులు వేయాలని అన్నారు.
cbn-teleconference