ప్రజాహక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల నిర్వహణలో కానిస్టేబుళ్ల పాత్ర గణనీయమైనదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల మన్ననలు అందుకునేలా ఉత్తమసేవలు అందించాలని ఆకాంక్షించారు. కానిస్టేబుల్ నియామక పరీక్షలో ఎంపికైన వారికి తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ర్యాంకర్లుగా నిలిచినవారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంపికైన వారిలో 500 మంది మహిళలు ఉండటం మరింత సంతోషకర విషయమన్నారు. తాజాగా ట్రైనింగ్ కు వెళ్తున్న వారందరికీ శిక్షణాకాలం ఉత్సాహవంతంగా గడవాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి చంద్రబాబు అభినందనలు - wishes
తెదేపా హయాంలో విడుదలైన పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 2వేల 623 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవటం సంతోషంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
చంద్రబాబు