ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

JD Laxminarayana: 'వ్యవస్థను మార్చేందుకు.. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తా' - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

CBI former jd laxminarayana: వ్యవస్థను మార్చేందుకు 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని సీబీఐ పూర్వ జాయింట్ డైరెక్టరు వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలోని నవజీవన్ బాలభవన్​లో చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న ఆయన 60వ సారి రక్తదానం చేశారు.

CBI former jd laxminarayana
సీబీఐ పూర్వ జాయింట్ డైరెక్టరు వి.వి.లక్ష్మీనారాయణ

By

Published : Apr 4, 2022, 11:43 AM IST

CBI former jd laxminarayana: 'ప్రస్తుత పాలనా వ్యవస్థలో లోపాలున్నాయి. వ్యవస్థను మార్చేందుకు నా వంతు కృషి చేస్తా. ఆ క్రమంలో 2024లో జరిగే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా' అని సీబీఐ పూర్వ జాయింట్ డైరెక్టరు వి.వి.లక్ష్మీనారాయణ తెలిపారు. తన పుట్టినరోజు వేడుకలను విజయవాడలోని నవజీవన్ బాలభవన్​లో ఆదివారం చిన్నారుల మధ్య ఆయన చేసుకున్నారు. కేకు కోసి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. బ్లడ్ బ్యాంకులో 60వ సారి రక్త దానం చేశారు. విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని తెలిపారు. ముఖాముఖిలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. 2024 ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని, ఏ పార్టీ తరఫున అంటే.. ప్రజల పార్టీ తరఫున అని సమాధానం ఇచ్చారు.

ఇదీ చదవండి: GVL Narsimha Rao: ధాన్యం సేకరణలో అవకతవకలపై దర్యాప్తు జరిపించండి: జీవీఎల్‌

ABOUT THE AUTHOR

...view details