ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్​.. తొలి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ - సీబీఐ

CBI charge sheet in Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ మొదటిసారిగా ఛార్జిషీట్​ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్​లో సీబీఐ తొమ్మిది మంది పేర్లను నమోదు చేసింది.

Delhi liquor scam
దిల్లీ మద్యం కుంభకోణం

By

Published : Nov 25, 2022, 4:13 PM IST

Delhi liquor scam Updates: దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్‌లో అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌ సహా ఏడుగురి పేర్లను నమోదు చేశారు. ఛార్జ్‌షీట్‌లో ఏ-1 కుల్దీప్ సింగ్, ఏ-2గా నరేంద్ర సింగ్ పేర్లు ఉండగా... ఛార్జ్‌షీట్‌లో ఏ-3 విజయ్‌నాయర్, ఏ-4 అభిషేక్ బోయిన్‌పల్లిగా చేర్చారు. ఛార్జిషీట్‌లో సమీర్ మహేంద్రు, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌ పేర్లు ఉన్నాయి.

ఛార్జిషీట్‌లో అప్పటి ఆబ్కారీశాఖ డి‌ప్యూటీ కమిషనర్‌ కుల్దీప్‌సింగ్‌, అప్పటి ఆబ్కారీశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేందర్ సింగ్‌ పేర్లు కూడా నమోదయ్యాయి. మద్యం స్కామ్‌లో సీబీఐ 10 వేల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌పై ఈనెల 30న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నిర్ణయించనుంది. సీబీఐ ఛార్జిషీట్‌ను ఆమోదించాలో లేదో ప్రత్యేక కోర్టు విచారించనుంది. తదుపరి కేసు విచారణ నవంబర్ 30కి రౌస్‌ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details