ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ARREST: జడ్జిలపై వ్యాఖ్యల కేసులో మరో ఆరుగురు అరెస్ట్.. కోర్టులో హాజరు

social media posts against judges case
social media posts against judges case

By

Published : Oct 22, 2021, 4:07 PM IST

Updated : Oct 22, 2021, 5:07 PM IST

15:59 October 22

సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్

న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ(cbi news) దర్యాప్తును ముమ్మరం చేసింది(social media posts against judges case news). ఈ కేసులో ఆరుగురు నిందితలను తాజాగా అరెస్ట్‌ చేశారు.  నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 11మందిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాధ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌ ఉన్నట్లు వెల్లడించారు.  

హైకోర్టు(ap high court on social media posts against judges case news) ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మంది నిందితులపై 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సీఐడీ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. గతంలో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి వేర్వురుగా ఛార్జ్‌షీట్లను సంబంధిత కోర్టులలో దాఖలు చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసిన సీబీఐ తాజాగా ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఇదీ చదవండి

TDP Leaders On Jagan : ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. తెదేపా నేతల ఆగ్రహం

Last Updated : Oct 22, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details