కృష్ణా జిల్లాలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో తాగునీటి కోసం పశువులు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ మండలాల సరిహద్దులో సముద్రం ఉండటం వలన భూగర్బ జలాలు ఉప్పుగా ఉంటాయి. ప్రకాశం బ్యారేజి నుంచి కేఈబీ కాలువ ద్వారా వచ్చే నీటినే పంట సాగుకు... చెరువుల్లో నింపుతూ తాగునీటి అవసరాలకు వినియోగిస్తుంటారు.
వేసవిలో కాలువకు నీరు నిలుపుదల చేసిన కారణంగా... కుళాయిల ద్వారా వచ్చే ఆ కొద్ది నీరు అవసరాలకు పోను.. తాగటానికి చేతి పంపులతో వచ్చే నీటిని వినియోగిస్తున్నారు.