ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువులకు మేత కావాలంటే... నదిని దాటాల్సిందే...! - కృష్ణా జిల్లాలో పశువుల కాపర్ల కష్టాలు

కృష్ణా జిల్లా కొక్కిలిగడ్డ, కొత్తపాలెంలో పశువుల కాపర్లకు గ్రాసం కష్టాలు తీరడం లేదు. ప్రమాదకరంగా నదిని ఈదుకుంటూ.. అవతలి గట్టుకు చేరుకుని పశువులను మేపుతున్నారు.

Cattle herders crossing the river dangerously for grazing in krihna district
ప్రమాదకరంగా కృష్ణా నదిని దాటుతున్న పశువుల కాపర్లు

By

Published : Sep 22, 2020, 6:11 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ, కొత్తపాలెం గ్రామస్థులు... కృష్ణానదితో నిత్యపోరాటం చేస్తున్నారు. పశువులను మేపడం కోసం వరద నీటిలో ప్రమాదకరంగా... థర్మకోల్ షీట్​ సహాయంతో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. లచ్చిగానిలంకకు చేరుకుని పశువులను మేపుతున్నారు. పశుగ్రాసం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని పశువుల కాపర్లు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details