కృష్ణా జిల్లా గుడివాడ నియోజక వర్గం పరిధిలో నందివాడ మండలం తమిరిశ సమీపంలోని చేపలచెరువు గట్లపై నిర్వహిస్తున్న జూద శిబిరాలపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీ జయకృష్ణరాజు నేతృత్వంలో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు జరిపారు. రూ.42 లక్షల నగదుతోపాటు డబ్బులకు బదులుగా వాడే ప్లాస్టిక్ టోకెన్లు లభించాయని ఏఎస్పీ తెలిపారు. 30 మంది జూదరులను అదుపులోకి తీసుకుని.. 20 కార్లు, 32 ద్విచక్ర వాహనాలు, 29 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మురళీ అనే వ్యక్తి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం తదితరులున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో జూద శిబిరాలపై దాడులు.. రూ.42 లక్షలు స్వాధీనం - గుడివాడ పేకాట రాయుళ్ల అరెస్ట్
కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గంలోని పేకాట స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. 30 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా నగదుతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో జూద శిబిరాలపై దాడులు