ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుల్వామా' అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ - విజయవాడ

పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు జీటో సంస్థ నగదు చెక్కులను అందించింది. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు ఒక్కొక్కరికి 3 లక్షల 80వేల చొప్పున నగదును ఇచ్చింది.

'పుల్వామా' అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

By

Published : Jun 2, 2019, 3:15 PM IST

'పుల్వామా' అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారి కుటుంబాలకు జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) సంస్థ ఆర్ధిక సహాయాన్ని అందించింది. విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు చెరో 3లక్షల 80వేల చొప్పున నగదు చెక్కును అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చట్టి ప్రవీణ్, విజయనగరానికి చెందిన గుల్లపల్లి శ్రీను పుల్వామా ఘటనలో మృతి చెందారు. వీరికి జీటో సభ్యులు నివాళులు అర్పించారు. దేశ సేవలో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన సైనికులనూ.. వారిని దేశరక్షణ కోసం పంపిన కుటుంబ సభ్యుల త్యాగం మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ 39బెటాలియన్ కమాండెంట్ దినేష్ కుమార్ సింగ్, జీటో సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details