ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలై.. పెండింగ్‌లో ఉన్న కేసులు లక్షా 94 వేల మేర ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలతో సంస్థలు, వ్యక్తులు వివాద పరిష్కారం కోసం ఈ రెండు కోర్టుల్లో వేసిన కేసులు లక్షలుగా పేరుకుపోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజూ వివిధ కోర్టుల్లో సుమారు 450 పిటిషన్లు దాఖలు అవుతున్నట్టు అంచనా.
ప్రత్యేకించి ప్రభుత్వ శాఖలు, అధికారులపై రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నట్లు తేలింది. గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు కోర్టు ఆదేశాలకు సంబంధించి ధిక్కరణ కేసులు ఉన్నాయని గుర్తించారు. ఇక ప్రత్యేకంగా ఆర్థిక శాఖ.. వివిధ కోర్టుల్లో ఉన్న 143 పిటిషన్లకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయని పరిస్థితులు ఉన్నట్లు సమాచారం.