ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీడియా పేరుతో బెదిరింపులు.. 8 మంది అరెస్టు - pds rice transport illegally newws

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారి నుంచి డబ్బులు డిమాండ్​ చేశారని ఆరోపణలు వచ్చిన వారిపై కేసు నమోదు చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనాన్ని, ఒక చాకు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

nandigama dsp
వివరాలు వెల్లడిస్తున్న నందిగామ డీఎస్పీ

By

Published : Nov 24, 2020, 2:16 PM IST

అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న వారి నుంచి డబ్బులు డిమాండ్​ చేశారని 9 మందిపై ఆరోపణలు వచ్చాయి. తాము విలేకరులమంటూ డబ్బులు అడిగారని.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు నందిగామ డీఎస్పీ తెలిపారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది.

పీడీఎస్​ బియ్యాన్ని తరలిస్తున్న ఆటో డ్రైవర్​ను రూ.యాభై వేలు ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. అతని దగ్గర ఉన్న రూ.ఐదు వేలు లాక్కున్నారని చెప్పారు. నిందితుల్లో 8 మందిని అరెస్ట్​ చేశామని.. కోర్టులో హాజరుపరచనున్నామని డీఎస్పీ వెల్లడించారు. వారి నుంచి బుల్లెట్ వాహనం, చాకు, రూ.20,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి గురించి తమకు సమాచారం అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details