ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేశినేని నాని తమ్ముడినంటూ మోసం..డబ్బు వసూలు చేసి పరారీ - కృష్ణా జిల్లా క్రైం

తెదేపా నేత కేశినేని నాని తమ్ముడినంటూ... ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని, ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయాడని బాధితులు వాపోయారు.

Case registered against a person in krishnalanka krishna district
కేశినేని నాని తమ్ముడినంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

By

Published : Sep 22, 2020, 8:32 PM IST

కేశినేని నాని తమ్ముడినంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

ఎంపీ, తెలుగుదేశం నేత కేశినేని నాని తమ్ముడినంటూ... తమ నుంచి కేశినేని రమేష్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేశాడని ఆరోపిస్తూ పలువురు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ గేట్ వే హోటల్​లో భాగస్వామినని, హెచ్ఆర్ఎం ఫైనాన్స్ సంస్థకు ఎండీనని నమ్మించి, గుంటూరు, తాడేపల్లికి చెందిన వ్యక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికేశ్వరరావు అనే వ్యక్తికి లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ.20 లక్షలు, శ్రీనివాసరావు అనే మరో వ్యక్తి నుంచి నాలుగున్నర లక్షల రూపాయలను తీసుకున్నాడని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details