Case file on police: ఓ చోరీ కేసు రహస్య విచారణ పోలీసులకు సమస్య తెచ్చి పెట్టింది. కొద్దిరోజుల కిందట చిత్తూరు జిల్లా కల్లూరు వద్ద ఓ భారీ చోరీపై పూతలపట్టు ఎస్ఐ ఆధ్వర్యంలో ఓ బృందం దర్యాప్తు చేసింది. తమిళనాడుకు చెందిన వైరముత్తు, అయ్యప్ప గ్యాంగ్ చోరీకి పాల్పడిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు తమిళనాడుకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని వారిలో ఆరుగురిని రహస్య ప్రాంతంలో విచారించారు. కల్లూరులో నాలుగు కేజీల బంగారు ఆభరణాలు చోరీ చేసి పలు రాష్ట్రాల్లో విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు.. మరో 31 కేసుల్లో ప్రధాన నిందితులైన పూమతి, అయ్యప్పను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. మిగిలిన నలుగురి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులు వారికి 41-ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు.
Case file on police: రహస్యగదిలో హింసించారని తమిళనాడు వ్యక్తుల ఫిర్యాదు.. పూతలపట్టు పోలీసులపై కేసు - kadapa police
Case file on police: చోరీ కేసు విషయంలో తమిళనాడుకు చెందిన పాత నేరస్తులను ఏపీ పోలీసులు రహస్యంగా విచారించగా.. తమను అక్రమంగా బంధించి హింసించారని ఫిర్యాదు చేయడంతో పోలీసులపై కేసు నమోదైంది. మరోవైపు.. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల సీఐ మంజునాథ్ రెడ్డి అనినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఓ విలేకరి మధ్యవర్తిత్వంతో లంచానికి పాల్పడినందుకు ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
ఏపీ పోలీసులపై ఫిర్యాదు.. తమిళనాడులోని ఆస్పత్రిలో చేరిన నిందితులు.. చిత్తూరు పోలీసులు విచారణ పేరుతో తమను అక్రమంగా రహస్య గదిలో ఉంచి హింసించారని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డికి సమాచారం ఇవ్వగా విచారణకు ఆదేశించారు. నగరి అర్బన్ సీఐ శ్రీనివాస్ తమిళనాడులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఎస్పీకి నివేదించగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. పూతలపట్టు ఎస్ఐ హరిప్రసాద్, కానిస్టేబుల్ తనిగాచలం, మరో నలుగురిపై సోమవారం రాత్రి చిత్తూరు టూటౌన్ సీఐ మద్దయాచారి కేసు నమోదు చేశారు.
- Amarnath murder case విద్యార్థి అమర్నాథ్ హత్య కేసు వివరణలో తడబడ్డ ఎస్పీ.. రెండోసారి ప్రెస్మీట్..
ఏసీబీకి చిక్కిన సీఐ.. వైయస్సార్ జిల్లా ఎర్రగుంట్ల సీఐ మంజునాథ్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. అవినీతిలో కూరుకుపోయిన పోలీసు అధికారుల ఒత్తిడి భరించలేక స్థానికంగా ఉన్న నాపరాయి లారీ యజమాని గంగాధర్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఎర్రగుంట్లకి చెందిన గంగాధర్ రెడ్డి నాపరాయి బూడిదను ఇతర ప్రాంతానికి తరలించే నిమిత్తం నెలవారీగా 15వేల రూపాయలు మామూలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేసినట్లు గంగాధర్ రెడ్డి తెలిపారు. లంచం డబ్బులు నేరుగా తీసుకోకుండా మధ్యవర్తిగా ఉన్న స్థానిక విలేకరి జిల్లాని బాషా ద్వారా అందజేసే విధంగా ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. తరచూ డిమాండ్ చేస్తూ ఉండడంతో నెల రోజులపాటు లారీని ఇంటి దగ్గరే పెట్టుకున్న గంగాధర్ రెడ్డి.. సీఐ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఏసీబి అధికారులు ఆశ్రయించారు. ఈరోజు కడప, తిరుపతికి చెందిన ఏసీబి అధికారులు ఎర్రగుంట్లకు వెళ్లి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న విలేకరి రూ. 8,600 గంగాధర్ రెడ్డి నుంచి లంచం తీసుకుంటూ ఉండగా వలపన్ని పట్టుకున్నారు. నెలరోజులు కిందకే సీఐ మంజునాథరెడ్డికి రూ.18వేలు గంగాధర్ రెడ్డి ముట్టజెప్పాడని ఏసీబీ అదనపు ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. ఈ కేసులో ఎర్రగుంట్ల సీఐ మంజునాథరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, విలేకరి బాషాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని వెల్లడించారు.