కృష్ణాజిల్లా గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదైంది. గత ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలపై గతంలోనే కేసు నమోదైంది. అందులో మరో ముగ్గురి భాగస్వామ్యం ఉందంటూ.. స్థానిక వైకాపా నాయకుడు ముప్పనేని రవికుమార్ బాపులపాడు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపి నివేదిక అందించాలని హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆదేశించినట్లు తహశీల్దార్ నరసింహారావు చెప్పారు.
నకిలీ పట్టాల పంపిణీ ఆరోపణలతో వల్లభనేని వంశీపై కేసు !
పేదల నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణతో తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై విచారణ జరపాలని కృష్ణా జిల్లా బాపులపాడు తహశీల్దార్ పోలీసులను ఆదేశించారు.
వల్లభనేని వంశీపై కేసు