కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామస్తుడు బోగాధి వెంకట సుబ్రమణ్యశాస్త్రి.. మాస్కులు లభించని పరిస్థితుల్లో.. క్యారీ బ్యాగునే మాస్కుగా మార్చేశారు. పది రోజుల క్రితం అవనిగడ్డ ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి అడిగా.. తర్వాత ఎక్కడ అడిగినా మాస్కులు దొరకలేదని చెప్పారు. అందుకే.. కరెంటు బిల్లు కట్టడానికి వచ్చి... ఇలా క్యారీ బ్యాగును మాస్కుగా విధిలేక వాడినట్టు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు అందరికీ మాస్కులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
క్యారీ బ్యాగే మాస్క్ అయితే..! - Carry bag using like a mask in krishna
కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరి నుంచి ఎవరికి సంక్రమించేదీ అర్థం కాకుండా ఉంది. మాస్కులు లేకుండా బయటకు వెళ్లలేం. ఆసుపత్రికి వెళ్లి అడిగితే.. లేవంటూ వెనక్కి పంపేస్తున్నారు. అందుకే ఆ వృద్ధుడికి ఓ ఆలోచన తట్టింది. అనుకున్నదే తడువుగా క్యారీ బ్యాగ్‌తో ఇలా చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
Carry bag using like a mask in Bhavadevarapalli in krishna