ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్వాపై కరోనా వైరస్ ప్రభావం.. తగ్గిన చేపలు, రొయ్యల ధరలు - ఆక్వాసాగుకు కరోనా ఎఫెక్ట్..

కరోనా వైరస్ ప్రభావం ఆక్వా రైతులపై కూడా పడింది. కరోనా దెబ్బకు చేపలు, రొయ్యలు ధరలు మార్కెట్​లో తగ్గుముఖం పడుతున్నాయి.

CARONA EFFECT ON ACQVA INDUSTRY
కరోనా వైరస్ ప్రభావంతో చేపలు, రొయ్యల ధరలు తగ్గుదల

By

Published : Feb 8, 2020, 3:35 PM IST

Updated : Feb 10, 2020, 6:13 PM IST

కరోనా వైరస్ ప్రభావంతో చేపలు, రొయ్యల ధరలు తగ్గుదల

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఆక్వా రైతులను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో సాగు చేస్తున్న చేపలు, రొయ్యలు జపాన్, ఐరోపా, లాటిన్ అమెరికా దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఆక్వా రంగంపై పడటంతో ఎగుమతులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వేసవిలో రొయ్యలు, చేపలు సాగు చేసే రైతులకు అధిక దిగుబడులు వస్తాయి. అయితే ఈ వ్యాధి ప్రభావంతో ఈ ఏడాది ఇతర దేశాలకు ఎగుమతులు నిషేధించడంతో... దేశం పరిధిలోనే ఎగుమతులు సాగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రభావంతో చేపలు, రొయ్యలు కిలో సగటున 20 రూపాయల చొప్పున ధరలు తగ్గినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. క్రమేపీ ఈ ధరలు ఇంకా క్షీణిస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు.

Last Updated : Feb 10, 2020, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details