కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో.. కూరగాయలు, పండ్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో విక్రయించే కాయగూరలు, పండ్లను ఇళ్లకు తీసుకెళ్ళాక.. నేరుగా తినకూడదని చెబుతున్నారు. ఈగలు, క్రిమికీటకాలతో పాటు.. వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున, ఉప్పునీటిలో కడుక్కుని తినాలని సూచిస్తున్నారు. విజయవాడలో కూరగాయలు, పండ్ల మార్కెట్లకు వెళ్ళొచ్చిన కొందరు కోవిడ్-19 ప్రభావానికి గురైన దాఖలాలు వెలుగుచూశాయి. పిల్లలు, వృద్దులు పండ్లను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు వివరిస్తున్నారు.
పండ్లు, కూరగాయలు అలా తినకండి - caring for consumption vegetables
పండ్లు, కూరగాయలు ఇంటికి తీసుకువెళ్లి ఉప్పు నీటిలో కడగాలని సూచిస్తున్నారు. తరువాతే వాటిని తినేందుకు, వంట చేసేందుకు ఉపయోగించాలంటున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

పండ్లు, కూరగాయలు అలా తినకండి