సరుకులను రవాణా చేసేందుకు.. విక్రయాలు చేసేందుకు.. కార్గో సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఈ రోజు కార్గో (సరుకుల రవాణా) సేవలను ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ కోటేశ్వర నాయక్ తెలిపారు. ప్రస్తుతం బస్సుల్లో ఉన్న ప్యాసింజర్ సీట్లు తొలగించి వాటిని సరుకుల రవాణాకు ఉపయోగిస్తున్నట్టు అవనిగడ్డ డీఎం చెప్పారు. అధికారులు నిర్ణయించిన ప్రకారం బస్సుకు కిలోమీటరుకు అయ్యే కిరాయి మొత్తం చెల్లిస్తే... ధాన్యం, మొక్కజొన్న, చేపలు, కూరగాయలు, పండ్లు సరుకులను.. ఎక్కడికైనా నిర్దేశించిన రేటు ప్రకారం రవాణా చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఉన్నతాధికారుల నుంచి టెలీ కాన్ఫరెన్స్లో ఆదేశాలు వచ్చినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం డిపో మేనేజర్ ఫోన్ నెంబర్ 9959225466 సంప్రదించాలని సూచించారు.
అవనిగడ్డలో ఈ రోజు నుంచి కార్గో సేవలు - అవనిగడ్డలో లాక్డౌన్
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో సేవలు నేడు అందుబాటులోకి రానున్నాయి. సరకులను ఆర్టీసీ బస్సులోనే నిర్ణీత రేటు ప్రకారం అమ్మకాలు చేసేందుకు ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు.
అవనిగడ్డలో ఈ రోజు నుంచి కార్గో సేవలు