ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీటీ పాలెంలో నిర్బంధ తనిఖీలు.. వేల లీటర్ల నాటుసారా స్వాధీనం - పెడనలో కార్డన్ సెర్చ్ వార్తలు

కృష్ణా జిల్లా పెడన మండలం డీటీ పాలెంలో పోలీసులు, ఎన్​ఫోర్స్​మెంట్ బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. 15 వేల లీటర్ల బెల్లం ఊట, వెయ్యి లీటర్ల నాటుసారా, నిర్వహణ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థులకు ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు.

cardon search in dt palem
డీటీ పాలెంలో కార్డన్ సెర్చ్

By

Published : Sep 26, 2020, 2:36 PM IST

కృష్ణా జిల్లా పెడన మండలం డీటీ పాలెంలో పోలీసులు, ఎన్​ఫోర్స్​మెంట్ బలగాలతో కలిసి.. నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎన్​ఫోర్స్​మెంట్ అడిషినల్ సీఐ జిందాల్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. 15 వేల లీటర్ల బెల్లం ఊట, వెయ్యి లీటర్ల నాటుసారా, నిర్వహణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

నాటుసారా కాస్తూ పదేపదే పట్టుబడితే.. వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గ్రామస్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నాటుసారా తయారీ వదిలేయాలని సూచించారు. ప్రభుత్వానికి సహకరించి స్కిల్ డెవలప్​మెంట్ కార్యక్రమంలో పాల్గొని జీవన శైలిని మార్చుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details