ACCIDENT: కరకట్టపై స్తంభాన్ని ఢీకొని కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి - krishna-district crime
04:07 September 18
కృష్ణా కరకట్ట పైనుంచి అవనిగడ్డ వస్తుండగా ప్రమాదం
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం K.కొత్తపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఒకరు మృతి చెందారు. కరకట్టపై స్తంభాన్ని ఢీకొన్న కారు.. కాల్వలోకి దూసుకెళ్లడం వల్ల ఘటన జరిగింది. కారులో ఉన్న ఆరుగురిలో.. ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు కాల్వలోకి దూకి.. కారు అద్దాలు పగులగొట్టి.. నలుగురిని కాపాడారు. మునిగిన కారును.. ట్రాక్టర్లతో ఒడ్డుకు లాగారు. విజయవాడ నుంచి చిరువోలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదీచదవండి.